Home సంపాదకీయం ప్రజారోగ్యాన్ని కాటేస్తున్న నకిలీ మందులు

ప్రజారోగ్యాన్ని కాటేస్తున్న నకిలీ మందులు

అనారోగ్యం ముంచుకొచ్చి, ఏదైనా మందో మాత్రో వేసుకుందా మనుకుంటే ఒక్కోసారి ఆ మందులే ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రాణం పోయాల్సిన మందులు చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చేవిధంగా తయారవుతున్నాయి. కంచే చేను మేసే విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా నకిలీ మందులు వీరంగం చేస్తున్నాయని, అత్యధికశాతం మంది ప్రజలు, ముఖ్యంగా అభం శుభం తెలియని అమాయకులు వీటికి బలవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తెలిసో తెలియకో ఆ నకిలీ మందులు వేసుకుంటే ఉన్న జబ్బు నయమయ్యే సంగతటుంచి, కొండ నాలుకకు మం దేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెతలా తయారవుతోంది పరిస్థితి. ఇలాంటి మాయదారి మందుల విజృం భణ ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉందని, తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో హెచ్చరించింది కూడా. అయినా ఎవరు పట్టించుకుంటున్నారు కనుక!.. అందులోనూ మనదేశంలో అనుమతులు లేని మందులు, లేదా నిషేధించిన స్థిర మోతాదు మిశ్రమం (ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌`ఎఫ్‌డీసి)తో కూడిన యాంటిబయోటిక్స్‌ అమ్మకాలు కొల్లలుగా ఉంటున్నాయని నిపుణుల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని గుల్ల చేసే అలాంటి మందు లను కూడా ఏదో ఒక విధంగా వాడకం లోకి తెచ్చి వ్యాపారం చేసుకోవడంలో సిద్ధ హస్తులెందరో ఉన్నారని దీనివల్ల తేట తెల్లమవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగాపెట్టి నిజమైన మందులు లాగానే.. నకిలీ మందులు తయారుచేసే కంపెనీలు, అక్రమార్జనే ధ్యేయంగా కల్తీ మందులతో ప్రజల ప్రాణాల్ని తీస్తున్న పైశాచిక వ్యాపారులు కొల్లలుగా పుట్టు కొస్తున్న నేటి సమాజంలో, ఇలాంటి అక్ర మాలను అదుపుచేసే నాధులు కనిపిం చడం లేదు. దేశంలో అక్కడక్కడా అప్పుడప్పుడూ అధికారుల తనిఖీల్లో నకిలీమందులు భారీస్థాయిలో పట్టుబడు తున్నా, అవి ఎక్కడినుంచి తయారవుతు న్నాయో గుర్తించేవారు కానీ, ఆయా కంపెనీలపై గట్టి చర్యలు తీసుకునేవారు కానీ లేరు. ఔషధ నియంత్రణ విభా గాలు డొల్లగానే ఉండడం, ప్రజల ఆరో గ్యాలతో ఆటలాడుకుంటున్న అక్రమా ర్కుల ఆట కట్టించేందుకు అవసరమై నంతమంది డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు లేకపోవడం ఒక పెద్ద లోపం. ఇవన్నీ కలసి వెరసి.. ప్రజారోగ్యానికి పెనుశాపంగా పరిణమి స్తున్నా, అటు ప్రభుత్వాలు కానీ, ఇటు పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో ఏఏటికాఏడాది నకిలీ మందులు, లేదా నాసిరకం మందులు గతంలో కంటే ఎక్కువగా జనంలోకి కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయనేది నిపుణుల ఆందో ళన. పెద్దపెద్ద నగరాల్లో సైతం నిత్యం అమ్ముతున్న మందుల్లో దాదాపు 20 శాతం మందులు నకిలీవిగానే ఉం టున్నాయనేది కూడా గతంలో జరిగిన నిపుణుల పరిశీలనల్లో తేలింది. ఏళ్ళ తరబడిగా నకిలీ మందులపై నియం త్రణ లేకపోవడంతో ఈ కల్తీ సామ్రా జ్యాలు ఇక ఎవరూ ఏమీచేయలేనంత, ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోతు న్నాయి. అయినా, నానా రకాల రోగా లతో, వ్యాధుల బాధలతో కుమిలిపోతూ డస్సిపోయి మంచంలో పడిపోయివున్న రోగులు పొరపాటునో గ్రహపాటునో ఆ నకిలీమందులు మింగితే ఎంత ప్రమా దమో ఊహించండి. ఏ గుండెజబ్బు తోనో, బీపీతోనో క్యాన్సర్‌తోనో అల్లాడే వారు గబుక్కున ఇలాంటి మందులు వేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. మందులు ప్రాణాలు పోయాలే కానీ.. తీస్తే ఎలా?.. ఇదేనా మన సంస్కృతి?.. కేవలం డబ్బు కోసం, ధనాశతో ఇతరుల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం ఎంత ఘోరం. ఇకనైనా ప్రభుత్వాలు
కళ్ళు తెరవాలి. ఈ నకిలీల భరతం పట్టాలి. అవసరమైతే చట్టాలకు మరింత పదునుపెట్టాలి. ఔషధ నియంత్రణ కట్టుదిట్టంగా ఉండేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ఏఏ జబ్బులకు ఏ మోతాదులో ఉండే ఏఏ మందులు వేసుకోవాలో వైద్యాధికార యంత్రాంగం ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలి. మందుల నాణ్యతను నిర్ధారించడానికి అవసర మైన యంత్రపరికరాలను, పరీక్ష శాలలను ఏర్పాటుచేసి, వినియోగం లోకి వస్తున్న మందులను ఎప్పటి కప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిశీ లించేందుకు తనిఖీ అధికారుల సంఖ్యను బాగా పెంచాలి. అంతేకాక, అసలు ఈ నకిలీ మందులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో, వాటి వెనుక ఎవరెవరున్నారో నిఘాబృందాలు కని పెట్టాలి. వాటిని పూర్తిస్థాయిలో నియం త్రించేందుకు కేంద్ర`రాష్ట్ర ప్రభు త్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యాన్ని నిర్దయగా కాటువేసే ఈ కల్తీమందుల కాలనాగులను కట్టడిచేయడం.. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఎంతైనా అవసరం!..

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here