Home రాష్ట్రీయ వార్తలు వందేళ్ళ తర్వాత.. తొలిసారిగా… మన రాష్ట్రంలోనే భూ సర్వే

వందేళ్ళ తర్వాత.. తొలిసారిగా… మన రాష్ట్రంలోనే భూ సర్వే

దాదాపు వందేళ్ళ తర్వాత తొలిసారిగా మన రాష్ట్రంలోనే సమగ్రమైన రీతిలో భూసర్వే ప్రారంభం అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలో అధికారులంతా ఈ కార్యక్రమం ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూమి, ప్రభుత్వభూమి, గ్రామకంఠం భూములతో పాటు ప్రతి భూమిని సర్వే చేస్తారు. అన్ని వివరా లను రికార్డుల్లో నమోదు చేస్తారు. యూనిక్‌ ఐడెంటిటీ నెంబర్‌తో కార్డు కూడా అందిస్తారు. ప్రతి రికార్డును డిజిటలైజ్‌ చేస్తారు. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-సంరక్షణ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన ప్రారంభం కానుంది. జిల్లాలోనూ అందుకు తగ్గ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సారధ్యంలో చేస్తున్నారు. తొలి దశలో జిల్లాలోని నాలుగు వందల గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని భూముల సమస్యలు కూడా ఒక కొలిక్కి రానున్నాయి. ఈ పథకం ప్రారంభం కానుండడంతో భూముల సొంతదారుల్లో, రైతుల్లో హర్షాతిరేకాలు వెల్లడవుతున్నాయి.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here