Home జిల్లా వార్తలు సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఉండాలి

సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఉండాలి

విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితం కోసం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. ఈనెల 22న వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (విఎస్‌యు)
8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్‌, విశ్వవిద్యాలయ కులపతి అబ్దుల్‌ నజీర్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఈఎన్‌టి శస్త్ర చికిత్స నిపుణులు డా.ఇ.సి. వినయ్‌కుమార్‌కు
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ నుంచి గవర్నర్‌ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. యూనివర్శిటీ ప్రగతి నివేదిక, కార్యాచరణ ప్రణాళిక నివేదికను వైస్‌ ఛాన్సలర్‌ జి.ఎం.సుందరవల్లి వివరిం చారు. అనంతరం గాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్‌ స్కాలర్లకు డిగ్రీ పట్టాలు, గోల్డ్‌ మెడల్స్‌ను గవర్నర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దే శించి గవర్నర్‌ మాట్లాడుతూ, విద్యార్థులందరూ ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం నెరవేరేందుకు సంకల్పం, పట్టుదలతో కృషి చేయాలన్నారు. మీరు సాధించిన డిగ్రీలు మీ వ్యక్తిగత యోగ్యతకు నిదర్శన మని, సమాజానికి సేవ చేయడానికి ఒక సోపానమని అన్నారు. గత పదిహేనేళ్లుగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సమాజానికి సేవ చేయడంలో విశేషమైన పురోగతిని సాధించిందని కొనియాడారు. అత్యుత్తమ న్యాక్‌ ఎ`గ్రేడును యూనివర్శిటీ పొందడం గర్వకారణమన్నారు. యూనివర్శిటీలో మౌలిక వస తులు బాగున్నాయని గవర్నర్‌ అభినందించారు.
29 మందికి గోల్డ్‌మెడల్స్‌
` వీసీ జిఎం సుందరవల్లి
విక్రమ సింహపురి యూనివర్సిటీలో స్నాతకో త్సవం సందర్భంగా 29 మందికి రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ చేతులమీదుగా గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తున్నట్లు విఎస్‌యు ఉపకులపతి జి.ఎం. సుందరవల్లి చెప్పారు. 275 మందికి డిగ్రీ పట్టాలు, పరోక్షంగా 3,301 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విక్రమ సింహపురి యూనివర్సిటీకి నాక్‌ సంస్థ ఏ గ్రేడ్‌ ఇవ్వటం వల్ల యూనివర్సిటీలో అనేక రకమైన ఇంజనీరింగ్‌ కోర్సులు ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు అవసరమైన మరిన్ని కోర్సులు ఏర్పాటుచేసి ఉన్నతమైన విద్యను అందించ డానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌ హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చరిత్రాత్మకమైనది.. నెల్లూరు సీమ
` డా. సతీష్‌రెడ్డి
నెల్లూరు సీమ చరిత్రాత్మకమైనదని, ఈ నేలపైనే కవిబ్రహ్మ తిక్కన మహాభారతాన్ని ఆంధ్రీకరించారని, ఈ సీమలోనే డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ చదువుకున్నారని, భారతదేశ పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సీమవారేనని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మన నెల్లూరీయుడైన డా.జి.సతీష్‌రెడ్డి అన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీకి ‘నాక్‌’ సంస్థ ఏ`గ్రేడ్‌ను ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఈ యూనివర్సిటీ ఉన్నత విద్యలు అందించడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని కొనియాడారు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here