Home రాష్ట్రీయ వార్తలు ఫలితాలకు ముందే.. ప్రతీకారాలు!

ఫలితాలకు ముందే.. ప్రతీకారాలు!

హమ్మయ్యా!.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగు శాతంలో రాష్ట్రం రికార్డు సాధించింది. తాము భయపడినంతగా ఈ ఎన్నికలలో అల్లర్లు, అరాచకాలు, అక్రమాలు జరగలేదు… అని, అధికారులు ఊపిరి పీల్చుకునేలోపే వాళ్ళ నెత్తిన పిడుగుపడిరది. పోలింగ్‌ జరిగిన మరుసటి రోజే నేతల కొట్లాటకి ఆంధ్రప్రదేశ్‌ వేదికయ్యింది. వరుస సంఘటనలతో చెలరేగిన హింసతో, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం రావణకాష్టమే అన్న సంకేతాలు ఇచ్చినట్లుగా అయ్యింది.
దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అల్లర్లకి, ఆగడాలకి, అరాచకాలకి ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రసిద్ధి. అలా చేయడం వారి ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో అలాంటి కుసంప్ర దాయం లేదు. గ్రామస్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికలలో చిన్నస్థాయి వర్గ తగాదాలు జరుగుతాయి తప్ప వీధి పోరా టాలు, వీరోచిత ప్రదర్శనలు ఉండవు. తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాక అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక రిపై ఒకరు ప్రతీకార చర్యలు తీసుకుం టారు. అధికార పగ్గాలు చేపట్టినవారు అంతకముందు అధికారంలో ఉన్నవారికి చుక్కలు చూపించడం అక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం.
మారుతున్న తరంతో పాటు…
మారుతున్న ఎన్నికల స్వరూపం!
పాత తరంలో ఎన్నికలంటే… గౌరవ ప్రదంగా జరిగే రాజ్యాంగ ప్రక్రియ మాత్రమే. వివిధ పార్టీల నుండి ప్రాతి నిధ్యం వహించి పోటీచేసే అభ్యర్థులు హుందాగా వ్యవహరించేవారు. అతి సామాన్య కుటుంబాలనుండి వచ్చినవారే ఎక్కువగా ఉండేవారు. ఒకరికొకరు ఎదురు పడితే కరచాలనం చేసుకుని పరస్పరం పలకరించుకునేవారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత అన్ని పార్టీలవాళ్లూ స్నేహితులలాగా కలసిపోయే వారు. నిస్వార్ధంగా తమ ప్రాంత అభివృద్ధి కోసం తమ తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు, అవసరాలూ తీర్చడం కోసం సమిష్టిగా కృషిచేసేవారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు అవతలవాళ్ళు తమ ప్రత్యర్థు లన్న భావనే లేకుండా వ్యవహరించేవారు.
నేటి తరంలో పరిస్థితి అలాలేదు. ఎన్నికలంటే ఆధిపత్యం కోసం పోరాడే రాజకీయ ప్రహసనంలా మారిపోయింది. పదవీ దాహంతో, అధికార వ్యామోహంతో వివిధ పార్టీల అభ్యర్థులుగా ఓవైపు కోటీశ్వరులు బరిలో దిగుతున్నారు. డబ్బుని మంచినీళ్లలా వెదజల్లి ఓటర్లని వేలం వేసి కొంటున్నారు. మరోవైపు రాజకీయ అనుభవం, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని ఆకురౌడీలు నయా నాయకులుగా అవతరించి ప్రజా క్షేత్రంలో పోటీచేసి పార్టీల గాలిలో గెలిచి చట్టసభలకి వెళ్తున్నారు. ఆ చట్ట సభలలో సైతం తమ సహజ నైజాన్ని ప్రదర్శించి బూతు పారాయణాన్ని వల్లిస్తున్నారు. అధికార మదంతో అడ్డంగా సంపాదించి రెండోసారి పోటీచేసే సమయానికి అంగబలం, అర్ధ బలం సిద్ధం చేసుకుని చొక్కాలు మడిచి, తొడలు చరిచి మళ్ళీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. గడచిన ఐదేళ్లు అహంకా రంతో విర్రవీగిన తాము మళ్ళీ గెలవ కుంటే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో అరాచకాలకి పాల్పడుతు న్నారు. తమ గెలుపుపై ఏమాత్రం అను మానం ఉన్నా అఘాయిత్యాలకు పూను కుంటున్నారు. అక్షరాలా అలాంటి ఆగ డాలే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. తెనాలిలో పోలింగు రోజే సహనం కోల్పో యిన అధికారపార్టీ సిట్టింగ్‌ శాసనసభ్యుడు అన్నాబత్తుల శివకుమార్‌ని క్యూలైన్లో రమ్మన్నందుకు ఆయన శివాలెత్తి సాక్షాత్తు ఓటరుపైనే చేయిచేసుకున్నారు. చంద్రగిరి, తాడిపర్తి, మాచర్ల నియోజకవర్గాలలో ఎన్నికల అనంతరం ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అనుచరులు పరస్పరం దాడులు చేసుకుని ఒకరినొకరు తరుము కున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగు రోజునుండి మొదలైన దాడుల పరంపర మూడురోజుల పాటు కొనసా గింది. రక్తం ఏరులై పారింది. పల్నాడులో ప్రతీకార చర్యలు పరాకాష్టకి చేరాయి.
చంద్రగిరి నియోజకవర్గానికి సంబం ధించి తిరుపతి పట్టణంలో చెలరేగిన హింస తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం వరకు వెళ్ళింది. నానిని రక్షించే క్రమంలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన నాని గన్‌మెన్‌ చివరికి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇక్కడ కిరాయి మూకలు సమ్మెటలు, గడ్డపారలు, ఇనుప రాడ్‌లు తీసుకుని బహిరంగంగా రోడ్లలో వీరంగం చేయడం అక్కడ ప్రజలని భయ బ్రాంతులకి గురిచేసింది.
తాడిపర్తిలో పోటీచేసే అభ్యర్థుల పరస్పర ఛాలెంజ్‌లు, దాడులు ఇక ప్రతీ ఎన్నికలలోనూ సర్వసాధారణమే. ఈసారి కూడా అదే జరిగింది. అటు జేసీ సోద రుల అనుచరులు, కేతిరెడ్డి అనుయాయులు యధాతధంగా దాడులు చేసుకున్నారు. రెండు పార్టీల ప్రధాన నాయకులని పోలీ సులు గృహనిర్బంధం చేసేవరకూ అన్ని చోట్లా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిచ్చి పీక్స్‌కి చేరిందనడానికి ఆల స్యంగా వెలుగుచూసిన వీడియో క్లిప్పింగే సాక్ష్యం. తన నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగు బూతులోకి నేరుగా వెళ్లి అక్కడ ఈవీఎంని ఆయనే స్వయంగా ఎత్తి నేలకేసి కొట్టారు. తాను ఒక శాసనసభ్యుడినన్న విచక్షణ కూడా ఆయన కోల్పోవడం గమనార్హం. ఆయనని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. అక్కడ పోలింగ్‌ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ
ఉండిపోయారు. ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ఇంకా అనేకచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం తమ భవిష్యత్తుపై అభ్యర్థులలో ఏర్పడిన అనుమానాలు, అపోహలే ఈ దాడులకి ముఖ్య కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆంధ్రలో భవిష్యత్తు రాజకీయాలకి అద్దం!
ఈ ఎన్నికలలో చెలరేగిన విధ్వంస కాండ, జరిగిన హింస చూస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్‌లో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా వుండబోతున్నాయో స్పష్టమవుతోందం టున్నారు విశ్లేషకులు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా తీర్పు రాకముందే నాయకులు ఓర్పును కోల్పోయారని, ఇది మంచి పరి ణామం కాదని ఒక సీనియర్‌ రాజకీయవేత్త అభిప్రాయపడ్డారు.
ఆగ్రహించిన
ప్రధాన ఎన్నికల సంఘం!
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటనలపై ప్రధాన ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. చాలాచోట్ల అధికారులకు స్థానచలనం కలిగించింది. కొంతమందిని సస్పెండ్‌ చేసింది. జరిగిన అన్ని సంఘటనలపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించింది.
కలవరపెడుతున్న
కొత్త ట్రెండ్‌!
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘట నలు రాజకీయవర్గాలలో పెద్ద చర్చగా మారాయి. రాష్ట్ర రాజకీయాలలో కొత్త ట్రెండ్‌ మొదలయ్యిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రశాంత రాష్ట్రంగా పేరున్న ఆంధ్రాలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని మేధావులు అంటున్నారు. ఏ పార్టీ అధికా రంలోకి వచ్చినా రెండవ పార్టీ సహకా రంతో అన్ని పార్టీల అధినేతలు, నాయ కులు, శ్రేణులు సంయమనం పాటించి సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర పురోభి వృద్ధికి పాటుపడాలి. అంతే తప్ప ఇలా పగలూ ప్రతీకారాలూ అంటూ దాడులకి, విధ్వంసాలకి తెగబడితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, అభివృద్ధి కుంటు పడిపోతుందని తలపండిన రాజకీయ వాదులు హెచ్చరిస్తున్నారు!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here