Home తుంగా అవార్డు

తుంగా అవార్డు

జిల్లాలోనే పత్రికారంగంలో ప్రతిష్టాత్మక అవార్డుగా లాయర్ అవార్డును 1982 నుండీ ప్రవేశపెట్టడం జరిగింది. 1995లో లాయర్ వ్యవస్థాపకులు తుంగా రాజగోపాలరెడ్డి గారు దివంగతులైన అనంతరం ఈ అవార్డును 1996 నుండి తుంగా రాజగోపాలరెడ్డి అవార్డుగా బహూకరించడం ఆనవాయితీగా మారింది.

ప్రతియేటా జరిగే లాయర్ పుట్టినరోజు పండుగలో జర్నలిస్టులకు, రచయితలకు, కళాకారులకు, రాజకీయవేత్తలకు గౌరవపురస్కార సత్కారాలు జరుగుతున్నాయి. కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారికి ప్రవేశమున్న ఈ మూడు రంగాలలో నిష్ణాతులను ఒక్కొక్కరిని ఎంపిక చేసి వార్షికోత్సవ వేదికపై వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతున్నది.

ఇప్పటివరకూ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను, పురస్కారాలను అందుకున్న ప్రముఖులలో సాహిత్య, జర్నలిజం రంగాల నుండి ప్రముఖ సినీరచయిత గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, సూర్యదేవర రామమోహన్ రావు, ఎ.బి.కె.ప్రసాద్, వి.రవిప్రకాష్, వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్, వి.శైలకుమార్, గుమ్మడి శ్రీనివాసులరెడ్డి, తుర్లపాటి కుటుంబరావు, తదితరులు వుండగా, కళారంగం నుండి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నటశేఖర కృష్ణ, మురళీమోహన్, యం.యస్.నారాయణ, జె.వి.రమణమూర్తి వంటి కళాదిగ్గజాలు లాయర్ సత్కారాన్ని స్వీకరించారు. రాజకీయ రంగం నుండి కళాదిగ్గజాలు లాయర్ సత్కారాన్ని స్వీకరించారు. రాజకీయ రంగం నుండి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి, ముప్పవరపు వెంకయ్యనాయుడు, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, జె.కె.రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాగుంట పార్వతమ్మ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, డి.యల్.రవీంద్రరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి రాజకీయ ఉద్ధండులున్నారు.