Home వేడుకలు

వేడుకలు

పాఠకదేవ్వుళ్ళ పండుగ

పత్రికకు పాఠకులే దేవుళ్ళు. పాఠకుల ఆదరణ, ఆశీస్సులే కొండంత అండ. అందుకే లాయర్ నిర్వహించే ప్రతి వేడుక ఓ పండుగే. పాఠకదేవుళ్ళను ఆరాధించే పవిత్రమైన పండుగ.

కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారి జన్మదినమైన నవంబర్ 8వ తేదీన 1996లో తొలిసారిగా నిర్వహించిన తుంగా పండుగ మొదలు 1997లో స్థానిక పత్రికా ప్రపంచంలోనే ఓ సంచలనంగా జరుపబడిన పాఠకుల పండుగ, నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన నవ్వుల పండుగ, పాత క్రొత్త పాటల మేలికలయికతో అలరించిన పాటల పండుగ, సాక్షూత్తూ నాటి రాష్ర్ట ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారే స్వయంగా అరుదెంచి అభినందించి, ఆశీర్వదించిన రజతోత్సవ పండుగ, సరిగమప అంటూ చిట్టి చిన్నారులు తమ గాన మాధుర్యంతో పరవశింపజేసిన సంగీత పండుగ… ఈ పండుగలన్నీ పాఠక మహాశయులను దైవాలకు ప్రతిరూపాలుగా భావించి లాయర్ వారికి అంకితమిచ్చిన ఆనంద సంబరాలే.

లాయర్ పత్రికను అత్యంత అందంగా రూపొందించి అపురూపంగా పాఠకులకు అందించే లాయర్ సిబ్బందికి వస్ర్తాలను బహూకరించడం ఈ పండుగలో ఓ సత్సంప్రదాయం. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఓ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ప్రతి వార్షికోత్సవ పండుగలో ఓ ప్రత్యేకం.

 

చిరస్మరణీయం రజతోత్సవం

పాతికేళ్ళ నిర్విరామ ప్రయాణం, మూడువందల నెలల నిరంతరశ్రమ, పదమూడు వందల వారాల నిస్వార్థకృషికి తార్కాణంగా హృదయోల్లాస ఆనంద సంరంభంగా జరిగింది లాయర్ రజతోత్సవం. ఈ యుగానికే గొప్ప వ్యక్తిగా యావత్ ప్రపంచం కీర్తింపబడిన ఆరణాల అచ్చ తెలుగు బిడ్డ ఆంధ్రరాష్ర్ట ముఖ్యమంత్రి, జనహృదయవిజేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా ఈ వేడుక జరిగింది.

 

లాయర్ తో ఆయనకున్న అనుబంధం, లాయర్ ఆయనకిచ్చిన సలహాలను, పాటించిన సందర్భాల మాటలు ఆయన నోట ముత్యాలలా జారుతుంటే లాయర్ ఆత్మీయుల హృదయం పులకించిపోయింది. ఆంధ్ర సాహితీ ప్రపంచంలోనే ఓ చిన్న పత్రిక చేసిన అతిపెద్ద సాహసంగా చరిత్రకెక్కిన లాయర్ రజతోత్సవ ప్రత్యేక సంచిక వారి అమృతహస్తాలతో ఆవిష్కరించబడి, లాయర్ ని ప్రముఖ వారపత్రికల స్థాయిలో అగ్రగామిగా నిలిపింది. తనకంటూ ఓ సొంత గూటిని ఏర్పాటు చేసుకున్న లాయర్ కార్యాలయాన్ని వై.యస్ సువర్ణహస్తాలతో ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి లాయర్ శ్రేయోభిలాషుల గుండె ఉప్పొంగి పోయింది. లాయర్ చరిత్రలో ఇది ఓ మరపురాని మరువలేని రోజు. లాయర్ ప్రస్థానంలో ఇది ఓ చిరస్మరణీయమైన ఘట్టం.