Home జాతీయ వార్తలు అడుగడుగో.. చందమామ!

అడుగడుగో.. చందమామ!

ఓర్పు`నేర్పు ఉండాలే కానీ సాధించ లేనిదేమీ ఉండదని పూణేకి చెందిన ప్రతిమేష్‌ జూజు అనే ఓ పదహారేళ్ళ కుర్రాడు నిరూపించాడు. అందాల చంద మామను ఫోటోలోకి చిక్కించుకున్నాడు. ఇంతవరకు మనం చాలాసార్లు చంద మామ ఫోటోలను చూస్తుంటాం కానీ, వాటిని పెద్దవి చేస్తే స్పష్టత ఉండేది కాదు. అయితే, చందమామ ఫోటోలను హై రెజ ల్యూషన్‌తో బాగా కనిపించేవిధంగా తీసి ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్నాడు ప్రతిమేష్‌. ఇప్పటివరకు ఇంత స్పష్టంగా చంద్రుడిని మరెవరూ ఫోటోలు తీయ లేదంటూ అందరూ ఆ కుర్రాడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు కూడా. ఆ ఫోటోలను చూస్తే, నిజంగానే చందమామను చాలా దగ్గరనుంచి చూస్తున్న అనుభూతి కలుగు తుందని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు సైతం అభినందిస్తున్నారంటే ప్రతిమేష్‌ ప్రతిభ ఎంత గొప్పదో అర్ధమవుతుంది. భూమి మీదనుంచి చంద్రుని ఫోటోలను ఇంత స్పష్టంగా తీయడమంటే మాటలు కాదు కదా!. అయితే ప్రతిమేష్‌ ఎంతో శ్రమతో టెలిస్కోప్‌, స్కై వాచర్‌తో పాటు సొంతంగా తయారుచేసుకున్న మరికొన్ని పరికరాల సాయంతో ఈ అద్భుతాన్ని సృష్టించి అందరి అభినందనలు అందు కుంటున్నాడు. తాను ఈ నెలలో ఓ అర్థ రాత్రి.. ఒంటి గంట సమయంలో చంద్రు డిని ఫోటో తీసినట్లు ప్రతిమేష్‌ చెప్తున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే, ఎంత జూమ్‌ చేసినా ఎలాంటి బ్లర్‌ (మసక) లేకుండా చంద్రుడి స్వరూపం స్పష్టంగా కనపడేలా తీయడం. నెట్‌లో ఇప్పుడు ఆ ఫోటోలు ప్రపంచాన్నే షేక్‌ చేస్తున్నాయంటే అతి శయోక్తి కాదు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here