Home సినిమా వార్తలు విలక్షణ నటుడు.. చలపతిరావు..కన్నుమూత

విలక్షణ నటుడు.. చలపతిరావు..కన్నుమూత

విలక్షణ నటుడు..తెలుగు చలనచిత్ర రంగంలో తనదంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న తమ్మారెడ్డి చలపతి రావు(78) డిసెంబరు 25న గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన మరణంతో తెలుగు సినిమా మరో మంచి నటుడిని కోల్పోయింది. సీనియర్‌ నటులు కృష్ణం రాజు, కృష్ణ, ఇటీవలే సత్యనారాయణ కొద్ది నెలల వ్యవధిలోనే ఈ లోకాన్ని వీడిపోవడంతో తెలుగు చిత్రరంగం విషాదంలో మునిగిపోయింది. అంతలోనే చలపతిరావు ఆకస్మిక మరణం టాలీవుడ్‌ను కలచి వేసింది. కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రు గ్రామంలో జన్మించిన చలపతిరావు, నటనారంగంపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌ అంటే తొలి నుంచీ అభిమానం. అదే ఆయన కెరీర్‌కు అండగా నిలచింది. ఎన్టీఆర్‌తో కలసి పలు చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు పాత్రలు వేసి సంచలనం కలిగిస్తే, చలపతి రావుకు అందులో అయిదుపాత్రలు ధరించే అవకాశం లభించింది. అన్ని పాత్రల్లోనూ చలపతిరావు తనదైన నటనాచాతుర్యంతో అతికిపోయి అందరినీ మెప్పిం చారు. యమగోల, డ్రైవర్‌రాముడు, సరదారాముడు, దొంగరాముడు, జస్టిస్‌ చౌదరి, బెబ్బులిపులి, కొండవీటి దొంగ, అన్నదమ్ముల అనుబంధం… ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన ఎన్టీఆర్‌తో కలసి నటించారు. విలక్షణ పాత్రల్లోనూ బాగా రాణించి ఎన్టీఆర్‌తో శెభాష్‌ అని పించుకున్నారు. హాస్యంతో కలిసిన విలనీలో చలపతి రావు నటన అమోఘం. దాదాపు 1500కు పైగానే చిత్రాల్లో ఆయన నటించి క్యామెడీవిలన్‌గా ప్రఖ్యాతి చెందారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే చలపతిరావు కన్నుమూయడంతో అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here