Home సింహపురి సమాచారం టాఫ్రిక్‌ కష్టాలు తీర్చండి బాబోయ్‌…

టాఫ్రిక్‌ కష్టాలు తీర్చండి బాబోయ్‌…

నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ నరకాన్ని తలపిస్తోంది. తరతరాలుగా అయ్యప్ప గుడి నుండి పెన్నా నది వరకూ ఒకే రోడ్డు వుంది. ట్రంకురోడ్డుగా ప్రసిద్ధి చెందిన ఈ రోడ్డు దశాబ్దాలు గడుస్తున్నా ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఏడుస్తోంది. 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో అక్కడక్కడా కొంత వెడల్పు చేశారు తప్ప ఆ తరువాత నాయకు లెవరూ ఈ ట్రంకురోడ్డుని పట్టించుకున్న పాపానే పోలేదు. రోడ్డు వెడల్పు ప్రతి పాదన వచ్చినప్పుడల్లా నగర నాయకులకి ఓట్లు గుర్తొచ్చి రాజకీయానికే ప్రాధాన్యత నిచ్చారు తప్ప ప్రజల కష్టాలను గాలికి వదిలేశారు. ఇప్పుడు కొత్తగా మినీబైపాస్‌ రోడ్డు కూడా శరవేగంగా అభివద్ధి చెందుతోంది, కానీ నగర వాసుల ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. పెద్దాసుపత్రి వరకు పెద్దగా సమస్య ఉండదు. అక్కడినుండి యంజి మాల్‌, కిమ్స్‌ ఆసుపత్రి, మాగుంట సర్కిల్‌, ఆర్‌టిసి బస్టాండ్‌, నెహ్రూ బొమ్మ ప్రాంతం, విఆర్‌సి కూడలి, గాంధీబొమ్మ జంక్షన్‌, కనకమహల్‌, ఆత్మకూరు బస్టాండు ప్రాంతాలలో ట్రాఫిక్‌ వాహన దారులకు చుక్కలు చూపిస్తోంది. చాలా చోట్ల రోడ్డు వెడల్పు చేయడానికి ఆస్కారం వున్నప్పటికీ ఇక్కడ పాలిటిక్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గతంలో రోడ్ల వెడల్పు ప్రక్రియలో భాగంగా భవనాలపై మార్కింగ్‌ కూడా చేసినప్పటికీ రాజకీయ నేతల జోక్యంతో అవి ఆగిపోయాయి. ఇప్పటి నేతలైనా ఒత్తిళ్లకు లొంగకుండా ట్రంక్‌రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

మినీ బైపాస్‌లో కూడా

అదే పరిస్థితి…

రాజీవ్‌ రహదారిగా నామకరణం చేయబడినా మినీ బైపాస్‌గా ప్రసిద్ధి చెంది అయ్యప్ప గుడి నుండి ఆత్మకూరుబస్టాండు వరకు నగరానికి తూర్పువైపున శర వేగంగా అభివద్ధి చెందుతున్న మరో రహదారిలో సైతం క్రమేణా ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. భక్తవత్సల నగర్‌, కొండాయపాలెం కూడలి, అన్న మయ్య సర్కిల్‌, బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ ప్రాంతాలతో పాటు రామలింగా పురం జంక్షన్లలో ట్రాఫిక్‌ చుక్కలు చూపి స్తోంది. రామలింగాపురం రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మూడవ లైను పట్టాల నిర్మాణ పని జరుగుతుండడంతో అక్కడ రాక పోకలు నిలిపేశారు, అలాగే ముత్తుకూరు కూడలి వద్ద ఆర్‌ఓబి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రోడ్ల వెడల్పును కుదించేశారు, ఈ రెండుపనులు ఒకేసారి జరుగుతుండడంతో వాహన చోదకులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అదుపు చేయడంచేతకాక రోడ్లను మూసేస్తున్నారు.

ట్రాఫిక్‌ సమస్యను తగ్గించాలంటే కొత్తగా రోడ్లను నిర్మించి కనెక్టివిటీ పెంచా ల్సింది పోయి, ఉన్న రోడ్లును కూడా మూసేస్తున్నారు, నగరంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను అదుపు చేయడంలో విఫలమైన ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లను మూసేశారు. ఇష్టానుసారం ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తు న్నారు. ఉదాహరణకు స్టోన్‌హౌస్‌పేటకు వెళ్లాలంటే ఊరంతా తిరిగి వెళ్ళాలి. మాగుంట విగ్రహం ప్రాంతంలో మళ్లిం పులు పెట్టి ట్రాఫిక్కును అస్తవ్యస్తం చేసే శారు, ఇలా నగరంలో గత 10రోజు లుగా ఎక్కడపడితే అక్కడ రోడ్లు మూసేసి, ట్రాఫిక్‌ను మళ్లించేసి ప్రజలకు పిచ్చెక్కి స్తున్నారు. ఒక ప్రణాళిక లేకుండా, ట్రాఫిక్‌ వ్యవస్థపైన అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకోకుండా తమ ఇష్టానుసారం మూసి వేతలు, మల్లింపులు చెయ్యడంతో నగర ట్రాఫిక్‌ వ్యవస్థ నరకాన్ని తలపిస్తోంది. మంత్రులు మాత్రం చెవులు మార్మోగే సైరన్లతో రయ్యిమని వెళ్లిపోతున్నారు, బారికేడ్లను సైతం తొలగించి వాళ్ళ వాహ నాలను అనుమతిస్తున్నారు. దీంతో ప్రజలు పడే బాధలు వాళ్లకు తెలియడం లేదు.

ఆటోవాలాల దౌర్జన్యం…

ఆటోవాలాల ఆగడాలకు కూడా అదుపులేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు. పరిమితిని మించి మందిని ఎక్కిస్తున్నారు, గట్టిగా ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. తమిళనాడు తరహాలో అధిక సంఖ్యలో ఆటోలు పోలీసు శాఖకు చెందినవారివే కావడంతో వారిని ప్రశ్నించే నాధుడు కరువయ్యాడు.

మంత్రి స్పందించాలి…

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఈ విషయంలో స్పందించాలి. ట్రాఫిక్‌ అధ్య యనం కోసం మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసి వారి సలహాలు సూచనలతో సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి. రోజురోజుకీ నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపో తోంది. రాబోయే 20 సంవత్సరాలను దష్టిలో పెట్టుకుని ఇప్పటినుండే చర్యలు చేపట్టకపొతే ముందు ముందు పరిస్థితి మరీ దారుణంగా మారే ప్రమాదముంది.

– సంచారి

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here