Home రాష్ట్రీయ వార్తలు ‘జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో.. తెలుగోళ్ళు ‘తగ్గేదే లే’

‘జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో.. తెలుగోళ్ళు ‘తగ్గేదే లే’

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈనెల 24వ తేది గురువారం ప్రకటించింది. అందులో మన తెలుగోళ్ళు ఏకంగా తొమ్మిది అవార్డులను సొంతం చేసుకున్నారు. అందులో 5 అవార్డులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సాధించింది. మొత్తమ్మీద జాతీయ అవార్డులు సాధించడంలో కూడా తెలుగోళ్ళు ‘తగ్గేదే లే’దంటూ తమ సత్తా నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అందరూ ఊహించినట్లుగానే పలు విభాగాల్లో అవార్డులు లభించడం విశేషం. ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదే లే’ అంటూ కోరమీసం తిప్పిన అల్లు అర్జున్‌కు కేంద్రం ‘ఉత్తమ నటుని’గా అవార్డునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
2021వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం న్యూఢల్లీిలో ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు తెలుగు సినిమారంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి అవార్డు లభించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఉత్తమ నటనాదర్శకత్వం వహించిన కింగ్‌సాలమన్‌, అదే సినిమాలో ఉత్తమ కొరియోగ్రఫీ నిర్వహించిన ప్రేమ్‌రక్షిత్‌కు,
ఉత్తమ సంగీతదర్శకునిగా ఏ.ఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)కి,
ఉత్తమ నేపథ్యగాయకునిగా ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘కొమురం భీముడో’ పాట పాడిన కాలభైరవకు ఉత్తమ అవార్డుడలు వచ్చాయి.
‘పుష్ప`ది రైజ్‌’ సినిమాలో అల్లు అర్జున్‌ విలక్షణ నటనకు ‘ఉత్తమ నటుడు’ అవార్డు రాగా, ఉత్తమ తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా మెగాస్టార్‌ మేనల్లుడు ‘పంజా వైష్ణవ్‌ తేజ్‌’ తొలి చిత్రం ‘ఉప్పెన’ ఉత్తమ అవార్డు నందుకుంది. ఇక మిగిలిన అవార్డుల విషయాని కొస్తే.. ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ’ ఎంపికైంది. ఉత్తమనటి అవార్డు ఇద్దరు నటీమణులకు లభించింది. ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో నటించిన ఆలియాభట్‌, ‘మీమీ’ చిత్రంలో నటించిన కృతిసనన్‌లకు ‘ఉత్తమ నటి’ అవార్డులు వచ్చాయి. ఉత్తమ సంభాషణల అవార్డు కూడా ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాకు లభించింది. హిందీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలో నటించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటిగా, ‘మీమీ’ హిందీ సినిమాలో నటించిన పంకజ్‌ త్రిపాఠికి ఉత్తమ సహాయ నటునిగా అవార్డులు లభించగా, ‘ది నంబీ ఎఫెక్ట్‌’ హిందీ చిత్రం ‘ఉత్తమ చిత్రం’ అవార్డును సాధించింది. ‘గోదావరి’ సినిమాకు దర్శకత్వం వహించిన నిఖిల్‌ మహాజన్‌కు ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డు, మలయాళం సినిమా ‘నాయట్టు’కు ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు లభించాయి. ‘సర్దార్‌ ఉద్దమ్‌’ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రఫీకి గాను అవిక్‌ ముఖోపాధ్యాయకు,
ఉత్తమ నేపథ్యగాయనిగా శ్రేయాఘోషల్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి.
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణి : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ నేపథ్యగాయకునిగా కాలభైరవ : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ యాక్షన్‌డైరెక్టర్‌గా కింగ్‌ సాలమన్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్‌రక్షిత్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ నటునిగా అల్లు అర్జున్‌ : ‘పుష్ప’
ఉత్తమ సంగీత దర్శకునిగా : దేవిశ్రీ ప్రసాద్‌
ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌ : కొండపొలం
ఉత్తమ తెలుగు చిత్రంగా : ఉప్పెన

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here