Home జిల్లా వార్తలు కోవూరు టీడీపీ అభ్యర్థిగా.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు ఖరారు!

కోవూరు టీడీపీ అభ్యర్థిగా.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు ఖరారు!

నెల్లూరుజిల్లా రాజకీయం కొద్ది రోజు లుగా కోవూరు నియోజకవర్గం చుట్టూ తిరి గింది. కోవూరు నుండి తెలుగుదేశం అభ్య ర్థిగా పోటీ చేయబోయేది ఎవరన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో జోరుగా సాగింది. చివ రికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి పేరుని టీడీపీ అధిష్టానం గురువారం ఖరారు చేసింది. వైసీపీ నుండి సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ప్రసన్న కుమార్‌రెడ్డి బరిలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ టీడీపీ అభ్యర్థి విషయంలోనే గురువారం వరకు సస్పెన్సు కొనసాగింది .
గత ఇరవై ఏళ్ళుగా ఈ నియోజక వర్గాన్ని మాజీ శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కనిపెట్టుకుని ఉన్నారు. దివంగత నేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ఆశీ స్సులతో 2004లో ఆయన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేసి అతి తక్కువ మెజారిటీతో ఆనాడు టీడీపీ నుండి పోటీచేసిన ప్రసన్నపై విజయం సాధించారు. పోలంరెడ్డిని జెయింట్‌ కిల్లర్‌ అని అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రశంసించారు కూడా.
ఆ తరువాత 2009లో టీడీపీ నుండి, 2012 ఉప ఎన్నికలలో వైసీపీ నుండి పోటీచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డి చేతిలో పోలంరెడ్డి వరుసగా రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2014లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి, ప్రసన్నపై విజయం సాధించారు. 2019లో మళ్ళీ ప్రసన్న చేతిలో ఓటమి పాలైనప్పటినుండి తన కుమారుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. కొడుకుని ఏంఎల్‌ఏగా చూడాలనుకున్నారు. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల కోవూరు సీటు ప్రశాంతిరెడ్డికి వెళ్ళిపోయింది.
తొలిసారిగా రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్త్రి సమీపంలోని పునబాక ప్రశాంతిరెడ్డి జన్మస్థలం. చదువుకునే రోజులనుండి నాయకత్వపు లక్షణాలు కలిగిన ప్రశాంతిరెడ్డి, తిరుపతి ఎస్‌వి మహిళా కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థి యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీగా కూడా పోటీ చేశారు. ప్రశాంతిరెడ్డి ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోటీ చేయనున్నారు. మొన్నటివరకు వీపీఆర్‌ వైసీపీలో ఉండడంతో ఆమె కూడా భర్త వెంటే ఆ పార్టీలో వున్నారు. విపిఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చేసే అనేక సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రశాంతిరెడ్డి కూడా భాగస్వామ్యు రాలయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు సభ్యురాలిగా, టీటీడీ దేవస్థానాల ఉత్తర భారతదేశ సలహామండలి అధ్యక్షురాలిగా ఆమెకు జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు.
ఐదేళ్ళు జగన్‌ వెంట నడిచిన వీపీఆర్‌ దంపతులు సరిగ్గా ఎన్నికలవేళ పార్టీ మారి వైసీపీ అభ్యర్ధులపై పోటీ చేయబోతున్నారు. తమ పార్టీ నుండి నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు నుండి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.
నల్లపరెడ్ల కంచుకోట కోవూరు!
కోవూరు నియాజకవర్గం ఏర్పడిన తరువాత 1952 నుండి 2019 వరకు ఇప్పటికి 16సార్లు ఆ నియోజక వర్గంలో ఎన్నికలు జరిగితే 9సార్లు నల్లపరెడ్డి కుటుం బమే గెలిచింది. 1952 నుండి 1962 వరకు కోవూరు కామ్రేడ్ల చేతిలో ఉండేది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా పక్షాన బసవరెడ్డి శంకరయ్య శాసన సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 1962 నుండి 1967వరకు రేబాల దశరథరామిరెడ్డి, 1967 నుండి 1972 వరకు వేమారెడ్డి వెంకురెడ్డి, 1972 నుండి 1983 వరకూ రెండు పర్యాయాలు గెలిచిన పెళ్లకూరు రామచంద్రారెడ్డి దాకా అందరూ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించినవారే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1983, మళ్ళీ 1985లో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తరువాత 1989లో ఆయన కాంగ్రెస్‌పార్టీలో చేరి, ఆ పార్టీ పక్షాన బరిలో నిలిచి గెలిచారు. శీనయ్య మరణానంతరం 1993లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టిక్కెట్టు పెళ్లకూరు రామచంద్రారెడ్డికి దక్కడంతో ఆ ఎన్నికలలో నల్లపరెడ్డి వారసుడిగా ప్రసన్న తెలుగుదేశం తరపున పోటీచేసి గెలిచారు. పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రసన్నని ఓడిరచడానికి సర్వశక్తులూ ఒడ్డినా, శీనయ్య సింపతీ ముందు అవన్నీ పనిచేయలేదు. ఆ తరువాత 1994, 1999 ఎన్నికలలో కూడా ప్రసన్న టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2004, మళ్ళీ 2014లో పోలంరెడ్డి కోవూరులో ప్రసన్నపై గెలిచి నల్లపరెడ్ల పరంపరకి అడ్డుకట్ట వేశారు. తాజాగా, 2019లో ప్రసన్నే గట్టెక్కారు.
యోధానుయోధులు బరిలోదిగి పోరాటం సాగించిన ఘనచరిత్ర ఉన్న నియోజకవర్గం కోవూరు. ఆ నియోజకవర్గం నుండి ఇప్పుడు కొత్త అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సీటు దక్కించుకుని పోటీ చేయబోతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నెగ్గుతుందా ` వైసీపీయే గెలుస్తుందా అన్నంతగా, రేపు కోవూరు ఫలితం కూడా ఎలావుండబోతుందోనన్న ఆసక్తి, ఉత్కంఠ ఇప్పుడు జిల్లా రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here