టాలీవుడ్ కార్తికేయుడు నిఖిల్ సిద్ధార్ధ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘స్వయంభూ”. పాన్ ఇండియా మూవీ అంటేనే బాడీ షేపింగ్ మీద శ్రద్ధ పెట్టాల్సిందే. అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు నిఖిల్. ఈ సినిమాలో నిఖిల్ కూడా మొట్ట మొదటి సారి ఓ వారియర్ గా కనిపించబోతుండగా అందుకోసం ఇప్పుడు గట్టిగా కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని అభిమానులతో పంచుకుంటూ… తాన ప్రాక్టీస్ నుంచి ఓ పిక్ షేర్ చేశారు. కర్ర సాము, మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం లాంటివి చేస్తున్నట్టుగా తాను తెలిపాడు.