Home సినిమా వార్తలు ఆయన రూపం.. ఇక ‘అమరదీపం’

ఆయన రూపం.. ఇక ‘అమరదీపం’

రౌద్రనటుడిగా..‘ప్రళయరుద్రుడు’గా..‘తాండ్రపాపారాయుడు’గా, ‘రంగూన్‌ రౌడీ’గా, ‘సీతారాముడి’గా… ఇలా ఎన్నో పాత్రల్లో విశేష నటనాచాతుర్యంతో అశేష ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించిన మొగల్తూరు మొనగాడు.. ఇక లేరు. ‘రెబల్‌స్టార్‌’గా పేరుగడిరచి, ‘భక్త కన్నప్ప’ వంటి కరుణార్ద్రపూరితమైన పాత్రల్లో రాణించిన నవరస నటనాధురీణుడు..కృష్ణంరాజు శివైక్యం చెందారు.
సినీరంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ తనదైన పాత్ర పోషించి.. కేంద్రమంత్రిగా కూడా ప్రజలకు సేవలం దించిన కృష్ణంరాజు 82 ఏళ్ళ వృద్ధా ప్యంలో అనారోగ్యం పీడిరచగా, హైదరా బాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 11వ తేదీ ఆదివారం వేకువన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీలోకం శోకతప్తమైంది. తెలుగునేల ఒక మహానటుడిని, ఒక మంచి నాయకుడిని కోల్పోయినట్లయింది.
సినీరంగంలో హీరో కృష్ణంరాజు సిని మాలంటే ఎంతో ప్రత్యేకతతో ఉండేవి. కొందరు నటిస్తే అది నటన అని తెలుస్తూనే ఉంటుంది. ఇంకొందరు నటిస్తే అది సహజంగానే ఉన్నట్లనిపిస్తుంది. ఈ రెండో కోవకు చెందిన వారే కృష్ణంరాజు. అందుకే ఆయన నటనే కాదు, ఆయన నటించే సినిమాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. వీర రసం, రౌద్రరసం పోషణలో ఆయన పెట్టింది పేరు. విలక్షణమైన నటనా చాతుర్యం ఆయన సొంతం. హీరోగా నటించినా, విలన్‌గా కనిపించినా ఆ సిని మాలన్నీ హిట్టే. ఆయన నటనలో వాచకం, అభినయం, ఆహార్యం అన్నీ సమతూకంలో ఉంటాయి. ఆ పాత్రలు ఆయనలో అమరి పోతాయి.
1940 జనవరి 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జననం. డిగ్రీ పూర్తయ్యాక సినిమాలపై మక్కువతో మద్రాసుకు వచ్చారు. మొదటి భార్య రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో శ్యామలాదేవిని రెండవ వివాహం చేసు కున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. కృష్ణంరాజు సోదరుని కుమా రుడే నేటి ప్రముఖ హీరో ప్రభాస్‌. ప్రభాస్‌ ‘బాహుబలి’ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన విషయం తెలిసిందే.
‘చిలకా గోరింక’తో సినీరంగ ప్రవేశం
1966లో కృష్ణంరాజు సినీరంగంలో ప్రవేశించారు. తొలి చిత్రంలోనే హీరోగా నటించారు. ‘చిలకా గోరింక’లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక
ఆనాటి నుంచి తిరిగిచూసింది లేదు. ప్రేక్షకుల ఆదరణతో ఆయన నటించిన చిత్రాలు దాదాపు అన్నీ సూపర్‌హిట్‌ చిత్రాలయ్యాయి. ఆ నటనా ప్రతిభ ఏమాత్రం తగ్గకుండా ఇటీవలి దాకా సుమారు 183 చిత్రాల్లో ఆయన నటిం చడం గొప్ప విశేషం. కృష్ణంరాజు సినిమా అంటే సూపర్‌హిట్‌ అనే పేరు తెచ్చుకు న్నారు. మనవూరి పాండవులు, రంగూన్‌ రౌడీ, సీతారాములు, త్రిశూలం, అంతిమ తీర్పు, కటకటాల రుద్రయ్య, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, ప్రళయ రుద్రుడు, తాండ్రపాపారాయుడు, పులి బెబ్బులి, కురుక్షేత్రం, రుద్రమదేవి, జీవన తరంగాలు, బిల్లా, ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్‌ ఇలా ఒకటేమిటి..ఎన్నో చిత్రాలు ఆయన నటనాప్రావీణ్యతకు నిదర్శనాలుగా నిలిచాయి. అమరదీపం, కృష్ణవేణి, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాల్లో ఆయన నటనకు ‘నంది’ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమారంగంలో నంది అవార్డులు అందుకున్న తొలి ఉత్తమనటుడు కూడా కృష్ణంరాజు కావడం విశేషం. అంతేకాదు, స్వయంగా పలు చిత్రాలు నిర్మించి గొప్ప నిర్మాతగా కూడా ఆయన రాణించారు. నటనే జీవితంగా..జీవితమే నటనగా అంకితభావంతో దశాబ్దాల తరబడి నటనారంగంలో ఉంటూ, సమా జాభ్యుదయాన్ని కోరుకుంటూ ఆణిముత్యాల వంటి సినిమాలందించిన కళామతల్లి ముద్దుబిడ్డ.. కృష్ణంరాజు.
ఏదేమైనా..సినీరంగలో వెండితెర రారాజుగా, రాజకీయాల్లోనూ రాజుగా వెలిగిన ఆ మహానటుడు..ఇక లేరనే బాధ అందరినీ కలచివేస్తోంది.
ఆయన రూపం ఇక ‘అమరదీపం’గా మిగిలింది.
రాజకీయాల్లోనూ రాణించిన మహానటుడు
సినిమా రంగంలో ఉన్నా రాజకీయరంగంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నటుడు..కృష్ణంరాజు. ఆ ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరి 1991లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నుంచి పోటీచేసి అపజయం పాలైనా, ఆ తర్వాత 1998లో బిజెపిలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అంతేకాదు, 1999లో టిడిపి`బిజెపి మిత్రపక్షం అభ్యర్థిగా నరసాపురం నుంచే మళ్ళీ పోటీచేసి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి ‘దటీజ్‌ కృష్ణంరాజు’ అనిపించుకున్నారు. లోక్‌సభలో బిజెపి విప్‌గా బాధ్యతలు చేపట్టి, 2000వ సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖకు సహాయమంత్రి అయ్యారు. రాజకీయాల్లో బాగా రాణించినా.. ఆ రంగంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. ఎంపీగా పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీచేసినా అపజయం ఎదురైంది. ఆ తర్వాత మళ్ళీ బిజెపిలో చేరి.. చివరిదాకా ఆయన బిజెపిలోనే ఉన్నారు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here