Home సినిమా వార్తలు ఆచార్యను నష్టాల్లోకి నెట్టిన కాజల్

ఆచార్యను నష్టాల్లోకి నెట్టిన కాజల్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ ఆచార్య సినిమా అని చెప్పవచ్చు. ఎన్నో అంచనాల మధ్య సినిమాను విడుదల చేయగా, ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఆచార్య. బయ్యర్లను, డిస్ర్టిబ్యూటర్లను ముంచేసిన ఈ సినిమా, మరోసారి పెద్దమొత్తంలో నిర్మాతలకు నష్టం తెచ్చిపెట్టింది. సౌత్ ఇండియా రైట్స్ తీసుకొన్న ఓ ప్రముఖ ఛానెల్ కాజల్ కార్యక్టర్ ను తీసేసినందున దాదాపు 7.50 కోట్లు వెనక్కు తీసేసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే, కాజల్ క్యారెక్టర్ పెద్దగా ఉపయోగం లేదని తీసేసామని ఆచార్య టీమ్ చెప్తున్నా, కాజల్ ఫ్యాన్స్ మాత్రం బాగా డిసపాయింట్ అయ్యారు. ఇప్పడు ఈ ఎపెక్ట్ తో ఆచార్య టిమ్ పరిస్థతి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయ్యిందని అంటున్నారు నెటిజన్లు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here